టీఎస్ ఇంట‌ర్ ఫస్టియ‌ర్ ఫలితాలు.. బాలిక‌లదే హవా..

152
- Advertisement -

తెలంగాణ ఇంట‌ర్ ఫస్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం మ‌ధ్యాహ్నం విడుద‌ల‌య్యాయి. ఫ‌స్టియ‌ర్‌లో 49 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు. బాలిక‌లు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు పేర్కొన్నారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు జ‌న‌ర‌ల్ విద్యార్థులు 4,09,911 మంది, వొకేష‌న‌ల్ విద్యార్థులు 49,331 మంది హాజ‌ర‌య్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 4,59,242 మంది. కాగా జ‌న‌ర‌ల్ విద్యార్థులు 1,99,786 మంది, వొకేష‌న‌ల్ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

ప్రస్తుతం సెకండియ‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కాగా,ఫస్టియ‌ర్ ఫ‌లితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. మార్కుల మెమోల‌ను 17వ తేదీన సాయంత్రం 5 గంట‌ల నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ పద్దతి అనుసరించాల్సి ఉంటుంది..

Step 1: విద్యార్థులు మొదటగా ఇంటర్ బోర్డ్ అధికారిక tsbie.cgg.gov.inను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం ‘TS Inter First Year Results 2021’ లింక్‌ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి
Step 3: దీంతో లాగిన్ పేజీ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, తదితర సూచించిన వివరాలను నమోదు చేయాలి.
3) అనంతరం ‘సబ్మిట్’ పై క్లిక్ చేయాలి
4)దీంతో స్క్రీన్ పై సబ్జెక్టుల వారీగా మీ రిజల్ట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మీ రిజల్ట్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

మీ మార్కులు తక్కువగా వచ్చాయని మీరు భావిస్తే రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యుయేషన్ కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు మీకు కల్పిస్తుంది.

- Advertisement -