- Advertisement -
తెలంగాణలో రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏలో 2019,2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్2019 నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారని ఐసెట్2019 కన్వీనర్ ఆచార్య సీహెచ్ రాజేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ నెల 11 నుండి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, మే 3వ తేదీ దరఖాస్తులకు చివరి రోజు.మే 9 నుండి ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 23,24 తేదీల్లో రాష్ర్టవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 29న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 1వ తేదీ వరకు కీపై అభ్యంతరాలు, అదే నెల 13న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.
- Advertisement -