కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ…

101
kcr cm

సెప్టెంబర్ 1న జరిగే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశానికి హాజరు కావాలని తెలంగా ణప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు తమ అభ్యంతరాలపై కేఆర్ఎంబీకి లేఖ రాసిన టీఎస్ సర్కార్…ఆ అంశాలను సమావేశంలో లేవనెత్తాలని నిర్ణయించింది.

తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు కేఆర్ఎంబీలో అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటాకోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో… సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్ తదిరతులు పాల్గొన్నారు..