వైద్యశాఖలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…

78
cm

రాష్ట్రంలో వైద్యశాఖలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డాక్టర్స్‌, నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్స్‌తో పాటు ఆయూష్ సిబ్బందిని నియమించనుండగా వీరిని కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్ చేసుకోనున్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో లభించనుండగా చివరి తేది మే 22.

మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ జీతం లక్ష రూపాయలుగా ఉండగా మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ 40 వేలు,మెడికల్ ఆఫీసర్ ఆయూష్‌ జీతం 35 వేలుగా ఉంది.స్టాఫ్ నర్సు జీతం 23 వేలు కాగా,ల్యాబ్ టెక్నీషియన్ జీతం 17 వేలుగా ఉంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కాగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉండనుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆసక్తిగల వారు https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.