క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం: శ్రీనివాస్ గౌడ్

121
srinivas goud

హైదరాబాద్‌లో ర‌వీంద్ర భార‌తిలో జాతీయ స్థాయి క్రీడాకారుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ర్టాన్ని క్రీడా హ‌బ్‌గా మారుస్తామ‌ని చెప్పారు. పారిశ్రామిక‌వేత్త‌లు ఒక్కో క్రీడ‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని మంత్రి కోరారు.

జాతీయ అథ్లెటిక్స్ దీప్తి, నందిని, మ‌హేశ్వ‌రిని రాష్ర్ట కీడ్రా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌న్మానించారు. ముగ్గురు క్రీడాకారిణుల‌కు ఎల‌క్ర్టిక్ స్కూటీల‌ను పంపిణీ, ఆర్థిక సాయాన్ని మంత్రి అంద‌జేశారు.