- Advertisement -
గోల్కొండ కోటలో జీఈఎస్ ప్రతినిధులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే విందు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, మండలి ఛైర్మన్స్వా మిగౌడ్, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
విదేశీ ప్రతినిధులంతా 45 మినీ బస్సుల్లో గోల్కొండ కోటకు చేరుకున్నారు. కాగా.. విదేశీ ప్రతినిధులు గుస్సాడి కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ సాంస్కృతిక వైభవంతో గోల్కొండ కోట వెలిగిపోయింది. ఇందులో భాగంగా తెలంగాణ ఆటాపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిథులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -