తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్‌ ఒప్పందం..

258
TS Govt collaborate with NASSCOM
- Advertisement -

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఐటీ విస్తరణకు తోడ్పడుతున్న నాస్కామ్‌కు అభినందనలు తెలిపారు.

డేటా సైన్స్ విస్తరణలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తోందన్నారు.వ్యవసాయ రంగానికి నిరంతర కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. అన్నిరంగాలతో డేటా సైన్స్‌కు ముడిపడి ఉందన్నారు. భవిష్యత్ అంతా ఉత్పాదన రంగానిదేనని నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ అన్నారు.

TS Govt  collaborate with NASSCOM

ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు ఉందని నాస్కామ్ నివేదికలో వెల్లడించింది. అంకురాలకు ఆర్థిక వనరుల సమీకరణ మరింత పెరగాల్సి ఉంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఈ ఏడాది కొత్తగా లక్ష ఉద్యోగాలు వచ్చాయి. వచ్చే ఏడాది మరో లక్ష ఉద్యోగాలకు అవకాశముంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్ రంగాల్లో వృద్ధి అధికంగా ఉంటుంది.

- Advertisement -