మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు గెజిటెడ్ అధికారుల కృతజ్ఞతలు..

270
minister srinivas goud
- Advertisement -

వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరణకు కృషి చేసిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. వెంకటయ్య ఆధ్వర్యంలో సంఘ కార్యవర్గ సభ్యులు కలసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు వి. మమత పాల్గొన్నారు.

వాణిజ్య పన్నుల శాఖను పటిష్టం చేసేందుకు, పన్నుల రాబడులను, పాలన సౌలభ్యం కోసం వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరణలో భాగంగా 18 వాణిజ్య పన్నుల సర్కిళ్ళు, మరో 161 నూతన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు అసోసియేషన్ తరుపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఆదాయంలో సింహాభాగం అందిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచటానికి అంకితభావంతో పానిచేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. వెంకటయ్య, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కి వివరించారు. అంతేగాకుండా సీఎం కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖపై తీసుకున్న సానుకూల నిర్ణయం పట్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేస్తామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. పన్నుల ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని పెంచే దిశగా, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు తీసుకవచ్చేలా ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులను కోరారు.

ఈ కార్యక్రమంలో జె. లక్ష్మీ నారాయణ, గౌరవ అధ్యక్షులు, ఎన్‌. దేవేందర్, ప్రధాన కార్యదర్శి, టి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, పి. రామలక్ష్మయ్య, క్రీడల కార్యదర్శి, రమేష్, హనుమాండ్లు, దేవేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -