విద్యుత్ బిల్లుల టైమింగ్స్ ఛేంజ్…

211
ts
- Advertisement -

రాష్ట్రంలో ఉదయం 10 గంటల తర్వాత పూర్తిస్ధాయి లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండటంతో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం బిల్లుల వసూలు కేంద్రాల సమయాన్ని మార్చింది విద్యుత్ శాఖ. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచివుంటాయని తెలిపారు అధికారులు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

- Advertisement -