టీఎస్ ఎంసెట్ 15 రోజులు వాయిదా…

207
TS Eamcet Notification 2018
- Advertisement -

తెలంగాణ ఎంసెట్ 15 రోజులు వాయిదా పడింది. లాక్ డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం పొడగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలను 15 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి.

అయితే ఈ వాయిదా ప్రభావం విద్యా సంవత్సరంపై లేకుండా అన్ని చర్యలు చేపడతామని, ఇబ్బందేమీ ఉండదని వెల్లడించారు.ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తామని పాపిరెడ్డి తెలిపారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని పేర్కొన్నారు.

- Advertisement -