తెలంగాణ ఎంసెట్‌ 2020‌ ఫలితాలు విడుదల..

185
TS EAMCET 2020
- Advertisement -

నేడు తెలంగాణ ఎంసెట్ మెడికల్,‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ కలిసి విడుదల చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్‌, అగ్నికల్చర్‌ విభాగాలకు అధికారులు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు.

ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ విభాగంలో 92.57 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు పాపిరెడ్డి తెలిపారు. 63,857 మంది అభ్య‌ర్థుల‌కు గానూ 59,113 మంది అభ్య‌ర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఈ ప‌రీక్ష‌కు 80.85 శాతం మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు.

ఎంసెట్‌లో తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు కైవ‌సం చేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన గుత్తి చైత‌న్య సింధు తొలి ర్యాంకు సాధించ‌గా, సంగారెడ్డికి చెందిన మారెడ్డి సాయి త్రిషా రెడ్డికి రెండో ర్యాంకు, తుమ్మ‌ల స్నికిత‌కు మూడో ర్యాంకు వ‌చ్చింది. న‌వంబ‌ర్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్నారు. 

గుత్తి చైత‌న్య సింధు – మొదటి ర్యాంకు

మారెడ్డి సాయి త్రిషా రెడ్డి – 2వ ర్యాంకు

తుమ్మ‌ల స్నికిత – 3వ ర్యాంకు

ద‌ర్శి విష్ణు సాయి – 4వ ర్యాంకు

మ‌ల్లిడి రిషిత్ – 5వ ర్యాంకు

చిగురుపాటి శ్రీమ‌ల్లిక్ – 6వ ర్యాంకు

ఆవుల సుభాన్ – 7వ ర్యాంకు

గార‌పాటి గుణ చైత‌న్య – 8వ ర్యాంకు

గిండేటి విన‌య్ కుమార్ – 9వ ర్యాంకు

కోట వెంక‌ట్ – 10వ ర్యాంకు

ఫలితాలను ఈ లింక్‌తో చెక్‌ చేసుకోండి: https://eamcet.tsche.ac.in/

- Advertisement -