ఇతర రాష్ట్రాలనుంచి కొందరు వ్యక్తులు వచ్చి రాష్ట్రంలో కిడ్నాప్ లు, దొంగతనాలు చేస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో దొంగలు తిరుగుతున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు డిజిపి మహేందర్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల సందర్భంగా ఆయన నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొంత మంది కావాలని ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దన్నారు.ఎవరైనా అనుమానంగా కనిపిస్తే ప్రజలు దాడులకు దిగుతున్నారని..అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
డయల్ 100కి కాల్ కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఇలాంటి తప్పుడు వార్తను విని ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్ని నిజం కాదన్నారు. ఫేస్ బుక్ , వాట్సప్ ఇలాంటి వార్తలు పంపిణ వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని విజ్నప్తి చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతులోకి తీసుకుంటే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్ధ చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్దను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో కూడా సీసీటీవిలు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు డిజిపి మహేందర్ రెడ్డి.