ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై సీఎస్‌ సమీక్ష..

133
cs
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ (పి.ఆర్.సి) సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పి.ఆర్.సి నివేదికతో పాటు,వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుటకు నిర్ణయం, తదితర అంశాలపై చర్చించారు.

వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు సంబంధించిన కాలానుగుణ పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు, తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. దీనికి సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్‌ను కూడా రూపొందించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -