సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి మ‌ంత్రి అల్లోల క్షీరాభిషేకం..

191
minister ik reddy
- Advertisement -

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో పదిశాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వ‌ల్ల అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు వ‌రంగా మార‌నుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఈడ‌బ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించిని నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ చిత్రప‌టానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్యెల్యే రేఖా శ్యాంనాయ‌క్, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కె. విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి,టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ.సత్యనారాయణ గౌడ్‌, టీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓసీల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా రిజర్వేషన్ల అమలుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం శుభపరిణామన్నారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అనంతరం ఆర్ అండ్ బీ ప‌నుల‌ను ప్రారంభించి.. పెంబి మండ‌లం ప‌సుపుల గ్రామం వ‌ద్ద నూత‌నంగా నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. అంత‌కుముందు పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు మంత్రి శంఖుస్థాప‌న చేశారు.

- Advertisement -