కార్మికుల సంక్షేమానికి.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పరితపించిన నాయకుడుగా వెంకట స్వామి ని యావత్ జాతి ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.వెంకట స్వామి 87 వ జయంతి సందర్బంగా జాతికి ఆయన సేవలు సీఎం స్మరించు కున్నారు. ఆయన జీవితం అందరికి స్ఫూర్తి దాయకం అన్నారు సీఎం.జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన నాయకుడని కొనియాడారు.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో వెంకటస్వామిది కీలకపాత్ర. కేంద్రమంత్రిగా…. కార్మికుల పక్షపాతిగా ఎన్నో సేవలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కాక వేలాది మంది పేదలకు నివాసాలు ఏర్పాటు చేశారు. ఇందుకు ఆయన పెద్ద ఉద్యమమే చేశారు. అప్పటి నుంచే ఆయనను గుడిసెల వెంకటస్వామి అని పిలుచుకుంటారు. పేదల నాయకునిగా చరిత్రలో నిలిచిపోయారు.పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గడ్డం వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్ లో పుట్టారు. తల్లి పెంటమ్మ, తండ్రి మల్లయ్య. బతికినంత కాలం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారు కాకా.