15న తెలంగాణ కేబినెట్ సమావేశం ..!

401
ts cabinet
- Advertisement -

గడిచిన తొమ్మిది నెలలుగా కొనసాగిన ఎన్నికల కోడ్‌ ముగిసింది. దీంతో పాలనపై దృష్టి సారించనున్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు రైతు రుణ మాఫీ,ఇప్పటికే నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో 15న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నారు. ఈ నెల 17న కొత్త గురుకులాలు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం,27లోపు సచివాలయానికి భూమి పూజ నిర్వహించనున్నారు. 14న ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

దీంతో పాటు వారంలోపు ఏపీ భవనాలు ఖాళీ అయితే.. మార్గదర్శకాలపై ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపిన వెంటనే అప్పగింత ప్రక్రియ పూర్తికానుంది. సచివాలయ భవనాలన్నీ తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకొని.. ఏయే బ్లాకు ఏయే శాఖకు కేటాయించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. తొలుత ‘ఎ, బి’ బ్లాకుల్లోని శాఖలన్నీ తరలించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వీటిని వెంటనే కూలగొట్టి.. ఆ ప్రాంతంలో భూమి పూజ చేసే అవకాశాలున్నాయి.

- Advertisement -