తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం(అక్టోబర్-27) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై చర్చించడానికి బీఏసీ సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
ఆయనతో పాటు..డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు, చీఫ్ విప్ కొప్పుల, జానా రెడ్డి, బట్టి విక్రమార్క, చిన్నా రెడ్డి, కిషన్ రెడ్డి, సండ్ర తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 50 రోజుల పాటు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ మరోసారి సమావేశం కానున్నది. ఇక.. వచ్చే నెల నవంబర్ 27 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా పడనుంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయాన్నితీసుకున్నారు.
కాగా… అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై అన్ని పార్టీల లీడర్లు ఈ సమావేశంలో చర్చించారు.