విజయ్…అదిరింది ట్రైలర్‌

292
Adirindhi - Official Telugu Trailer
- Advertisement -

తమిళనాట రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతన్న మూవీ మెర్సల్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పొలిటికల్ కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారిన వసూళ్లను మాత్రం ఆపలేకపోయింది. రేపు తెలుగులో అదిరింది అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.  ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా ఇందులో సత్య రాజ్ , ఎస్ జె సూర్య సపోర్టింగ్ రోల్స్ పోషించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ బేనర్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది.

కళ్లు లేకుండా బతకొచ్చు. కానీ పిల్ల లేకుండా ఎవ్వరూ బతకలేరు, తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికిమూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది అనే డైలాగులను ట్రైల‌ర్‌లో చూడొచ్చు.  ఈ సినిమాలో విజ‌య్ త్రిపాత్రాభినయం చేసిన సంగ‌తి తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లైన కాజ‌ల్‌, నిత్యామీన‌న్‌, స‌మంత‌ల‌ను కూడా ఈ ట్రైల‌ర్‌లో చూడొచ్చు.

- Advertisement -