సీజేఐపై షూతో దాడికి యత్నం!

4
- Advertisement -

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్‌ గవాయ్‌ పై ఓ లాయర్‌ దాడికి యత్నించారు. సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో కోర్టు కార్యకలాపాలు జరుగుతుండగా సీజేఐపై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు లాయర్‌ను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు.

విచారణ సమయంలో డయాస్‌ వద్దకు వెళ్లిన సదరు లాయర్‌.. షూ తీసి సీజేఐపైకి విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాయర్‌ని అడ్డుకుని బయటకి లాక్కెళ్లారు.అనంతరం పోలీసులకు అప్పగించారు.

సనాతనానికి జరిగే అవమానాన్ని మేము సహించము అంటూ ఆ న్యాయవాది గట్టిగా అరిచారు. ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని తనని ప్రభావితం చేయదని పేర్కొన్నారు.

Also Read:MBBS విద్యార్థికి అండగా కేటీఆర్..

- Advertisement -