అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సమయంలో, హోర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ..“అమెరికా నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధ సామగ్రి అన్నీ ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతాయి. పూర్తి ఒప్పందం అమలు అయ్యే వరకు మా బలగాలు సిద్ధంగా ఉంటాయి” అని పేర్కొన్నారు.
ఒప్పందం పాటించకపోతే తీవ్ర సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ,..ఏ కారణంగానైనా ఈ ఒప్పందం అమలు కాకపోతే, అప్పుడే ‘షూటింగ్’ ప్రారంభమవుతుంది — గతంలో ఎప్పుడూ చూడని విధంగా భారీగా ఉంటుంది అని తెలిపారు.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి, సురక్షితంగా ఉండాలని ట్రంప్ అన్నారు.ఇది చాలా కాలం క్రితమే ఒప్పందంలో భాగం — ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదు, అలాగే హోర్ముజ్ జలసంధి ఎప్పుడూ ఓపెన్ & సేఫ్‌గా ఉండాలిఅని స్పష్టం చేశారు.ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ అంశం అణు ఆయుధాల తయారీకి దారితీసే అవకాశంగా భావిస్తున్నారు.
మా గొప్ప సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉంది. అమెరికా మళ్లీ బలంగా నిలుస్తోంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

