శుభ్‌మన్‌ గిల్‌కు షాక్!

7
- Advertisement -

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు భారీ ఫైన్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు భారీ జరిమానా విధించారు. ఐపీఎల్ పాలక మండలి… గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 8న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 210 పరుగులు సాధించింది.

ఈ లక్ష్యాన్ని చేధించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి వరకు పోరాడింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరి వరకు వెళ్లింది. అయితే డేవిడ్ మిల్లర్ కీలక సమయంలో సింగిల్ తీసుకోకుండా చేసిన పొరపాటు (brain-fade) కారణంగా మ్యాచ్ మలుపు తిరిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఒక పరుగుతో విజయం సాధించి ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ…మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడంపై స్పందిస్తూ, “మాకు గెలిచే అవకాశం ఉందని అనిపించింది అన్నారు. ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ, “కొన్ని ఓవర్‌థ్రోలు, ఒక బౌండరీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ 5-6 పరుగులు కూడా చాలా తేడా చేస్తాయి. ముఖ్యంగా ఒక పరుగుతో గెలిచే మ్యాచ్‌లో ప్రతి చిన్న పొరపాటు లేదా మంచి ప్రయత్నం కూడా కీలకం అవుతుంది” అని గిల్ పేర్కొన్నారు.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

210 పరుగులు ఈ పిచ్‌పై మంచి స్కోర్. మేము 10-15 పరుగులు ఎక్కువ చేశామని భావించాం. డెత్ ఓవర్లలో కూడా పెద్ద షాట్లు ఆడటం సులభం కాదు, పిచ్ నెమ్మదిగా ఉంది అని ఆయన తెలిపారు.

- Advertisement -