అమల్లోకి ట్రంప్ టారీఫ్..వీటికి మినహాయింపు?

5
- Advertisement -

భారతదేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలు బుధవారం నుండి అమలులోకి వచ్చాయి. ఆగస్టు 27 నుండి ఈ ఉత్తర్వు అమల్లోకి వస్తుందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రచురించిన ముసాయిదా నోటీసు పేర్కొంది.

అమెరికా మార్కెట్లో వినియోగానికి ఎంట్రీ ఇచ్చే భారతీయ వస్తువులన్నిటికీ లేదా గిడ్డంగుల నుండి వినియోగానికి తీసుకునే వాటికి ఈ 50 శాతం అదనపు సుంకం వర్తిస్తుంది.ఇప్పటికే జూలై 30న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించారు.

అమెరికా కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం, భారతదేశం నుండి వచ్చే చాలా ఉత్పత్తులపై ఈ అధిక సుంకాలు వర్తిస్తాయి. అయితే కొన్ని ఉత్పత్తులు మినహాయింపుకు గురయ్యాయి.

మినహాయింపులు:

ఇనుము, ఉక్కు మరియు వాటి ఉత్పత్తులు

అల్యూమినియం మరియు దాని ఉత్పత్తులు

ప్రయాణికుల వాహనాలు (సెడాన్లు, SUVలు, క్రాసోవర్‌లు, మినీవ్యాన్‌లు, కార్గో వ్యాన్‌లు, లైట్ ట్రక్కులు) మరియు వాటి విడి భాగాలు

రాగి ఉత్పత్తులు

భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో సుమారు 30.2 శాతం (USD 27.6 బిలియన్ విలువైనవి) కొత్త సుంకాలున్నా కూడా డ్యూటీ-ఫ్రీగా మిగిలి ఉంటాయి. ఫార్మా ఉత్పత్తులు: USD 12.7 బిలియన్ (క్యాన్సర్ మందులు, ఇమ్యూన్ సప్రెసివ్, హృదయ వ్యాధి, మధుమేహం, నొప్పి నివారణ మందులు)

ఎలక్ట్రానిక్స్: USD 8.18 బిలియన్ (స్మార్ట్‌ఫోన్లు, రౌటింగ్ పరికరాలు, చిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, స్టోరేజ్ పరికరాలు)

ఇంధనం: USD 3.29 బిలియన్ (శుద్ధ లైట్ ఆయిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం)

పుస్తకాలు & బ్రోచర్లు: USD 165.9 మిలియన్

ప్లాస్టిక్ ఉత్పత్తులు: USD 155.1 మిలియన్

Also Read:విఘ్నాలను తొలగించే విఘ్నేశా…నమో నమః

- Advertisement -