అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ….ఇరాన్‌ను అణు ఆయుధాల అంశంపై న్యాయసమ్యమైన ఒప్పందానికి రావాలని కోరుతూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అణు ఆయుధాల అభివృద్ధిని పూర్తిగా వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ ను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో జరిగే సైనిక చర్యలు ఇంకా ఘోరంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం కదులుతోందన్న తన పూర్వ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసిన ట్రంప్, ఆ దళం ఇప్పటికే ప్రయాణంలో ఉందని, అవసరమైతే వేగంగా మరియు తీవ్రంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ట్రంప్ మాట్లాడుతూ…భారీ నౌకాదళం ఇరాన్ వైపు వేగంగా కదులుతోంది. ఇది శక్తి, ఉత్సాహం, లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అబ్రహామ్ లింకన్ అనే మహత్తర విమాన వాహక నౌక ఆధ్వర్యంలో ఈ దళం ఉంది. అవసరమైతే వేగం, హింసతో తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంది అన్నారు.సమయం చాలా తక్కువగా ఉందని హెచ్చరిస్తూ, “ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు వచ్చి అణు ఆయుధాలు లేని న్యాయమైన ఒప్పందానికి అంగీకరించాలని ఆశిస్తున్నాను. ముందు కూడా ‘డీల్ చేయండి’ అన్నాను. వారు చేయలేదు. ఫలితంగా ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ జరిగింది. తదుపరి దాడి ఇంకా భయంకరంగా ఉంటుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read:BRS:లక్ష సంతకాల సేకరణ

