మధ్యప్రాచ్యంలో దాడులను నిలిపివేసి, శాంతి ఒప్పందానికి వేదిక సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవడం ఒక ప్రధాన అంశం కాగా, ఉద్రిక్తతలు తగ్గించాలని సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది.
ఇరాన్‌తో జరుగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం (ఫ్రేమ్‌వర్క్) రూపుదిద్దుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తెలిపారు. ప్రాంతీయ మిత్రదేశాలతో కూడిన విస్తృత ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నందున, ప్రస్తుతం ఇరాన్‌పై కొత్త మిలిటరీ దాడులను వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ప్రతిపాదిత ఒప్పందంలో “హోర్ముజ్ జలసంధిని వెంటనే, పూర్తిగా తెరవడం” మరియు ఇరాన్ అణు ముప్పుకు ముగింపు పలకడం భాగమని చెప్పారు. ఈ ఒప్పంద సాధనలో అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని ఆయన తెలిపారు.
ఒప్పందం దిశగా అర్ధవంతమైన పురోగతి లభిస్తే సైనిక దాడులను రద్దు చేయడానికి అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు.ప్రపంచ శ్రేయస్సు కోసం, అలాగే ఒక విజయవంతమైన, సంపన్నమైన ఇరాన్ నిలకడ కోసం.. త్వరితగతిన ఒప్పందం కుదిరే షరతుకు లోబడి, ప్రణాళికాబద్ధమైన సైనిక దాడిని రద్దు చేయడానికి నేను అంగీకరించాను అని ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read:‘ది ప్యారడైజ్’..టీజర్ అప్‌డేట్
గత ఐదు నెలలుగా సాగుతున్న ఈ పోరాటానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కలిసి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.

