భారతీయులకు మరో షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటే.
ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించాం అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్ట్ లుట్నిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అంటూ లుట్నిక్ పేర్కొన్నారు.
1990లో హెచ్-1బీ వీసా అమల్లోకి తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ఈ వీసాలను జారీ చేస్తాయి. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. హెచ్-1బీ వీసా దారుల్లో భారతదేశం 71శాతం వాటా కలిగి ఉంది. ప్రతీయేటా 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది.
Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

