ఢిల్లీ విందులో ట్రంప్ తో సీఎం కేసీఆర్ ముచ్చట్లు

481
kcr Trump
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బృందం భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు.

వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.. కేసీఆర్ కు కరచాలనం చేసి, కొద్ది క్షణాలు మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (జీఈఎస్) సదస్సు విషయాన్ని ప్రస్తావించారు. తన కుమార్తె ఇవాంకా హాజరైన ఆ సదస్సుకు తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యం భేష్ అని అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సీఎం కేసీఆర్ పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

- Advertisement -