ట్రంప్ ఆఫీసుపై బాంబు దాడి..

179
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఉత్కంఠ పెరిగిపోతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కరోలినా ప్రాంతంలో ఉన్న ట్రంప్ కార్యాలయం కిటికీ గుండా లోపలకు బాంబులు విసిరారని పోలీసులు తెలిపారు. ‘నాజీ రిపబ్లికన్లు నగరాన్ని వీడి పోవాలి లేకపోతే..’ అని హెచ్చరిస్తూ.. గుర్తు తెలియని వ్యక్తులు హిల్స్‌బర్గ్‌లోని రిపబ్లికన్‌ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.

america

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. దాడి ఉదంతంపై పోలీసులు విచారిస్తున్నారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బాంబుదాడిని తీవ్రంగా ఖండించారు. ‘ ఉత్తరకరోలినాలో తాము గెలుపు దిశగా ఉన్నాం. అందుకే ఈ దాడి చేశారు’ అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరగడం అమెరికాలో కలకలం రేపింది.

America

- Advertisement -