ట్రంప్‌కు భారీ షాక్..రూ.2900 కోట్ల జ‌రిమాన

23
- Advertisement -

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. త‌ప్పుడు ఆర్థిక ప‌త్రాల‌తో బ్యాంకుల‌ను మోసం చేసిన కేసులో న్యూయార్క్ జ‌డ్జి 355 మిలియ‌న్ల డాల‌ర్లు ఫైన్ విధించారు. అంటే దాదాపు 2900 కోట్ల పెనాల్టీని ట్రంప్ చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే న్యూయార్క్ కార్పొరేష‌న్‌కు ఆఫీస‌ర్‌గా కానీ డైరెక్ట‌ర్‌గా మూడేళ్ల పాటు ఉండ‌కూడ‌ద‌ని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. తన ప్రాపర్టీల విష‌యంలో ట్రంప్ అబద్దాలు చెప్పిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉండగా మూడేళ్ల పాటు ట్రంప్ మ‌ళ్లీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోరాదని తీర్పులో స్పష్టం చేశారు. అయితే తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు ట్రంప్.

Also Read:పిక్ టాక్ : ఉఫ్.. థైస్ తో ఫుల్ గ్లామర్ డోస్

- Advertisement -