అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిలీఫ్ దక్కింది. ట్రంప్‌కు అండగా నిలిచింది ఆ దేశ సుప్రీం కోర్టు. అమెరికా అధ్యక్షులకు తాము తీసుకున్న నిర్ణయాల పట్ల పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించింది. ట్రంప్ పై నమోదు అయిన కేసుల్లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
ప్రధానంగా ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు రాగా దీనిపై తీర్పును వెలువరించింది. ఈ కేసులో 6-3 తేడాతో ధర్మాసనం తీర్పునివ్వగా అధికారిక చర్యలకు రక్షణ ఉంటుందని, కానీ అనధికార చర్యలకు ఇమ్యూనిటీ ఉండదని స్పష్టం చేసింది.
రాజ్యాంగ అధికారాలను నిర్వర్తిస్తున్న అధ్యక్షుడిని ప్రాసిక్యూట్ చేయలేమని… అలాంటి అధ్యక్షులకు అధికారిక చర్యల నుంచి రక్షణ ఉంటుందని కోర్టు చెప్పింది. దీంతో రాబోయే నవంబర్ ఎన్నికల వరకు ట్రంప్‌కు రిలీఫ్ లభించినట్లు అయింది.
Also Read:Ajith:’విడాముయర్చి’ ఫస్ట్ లుక్