మొక్కలు నాటిన ఓయూ పాలక మండలి సభ్యులు పెర్క శ్యామ్..

271
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ పాలక మండలి సభ్యులు పెర్క శ్యామ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పెర్క శ్యామ్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విసిరినఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఓయూలో మొక్కలు నాటడం జరిగింది.

అనంతరం మరో ముగ్గురికి ( ఓయూ I/c VC& MAUD& డైరెక్టర్ అరవింద్ కుమార్, దర్శకుడు సంపత్ నంది, TSPSC చైర్మన్ గంట చక్రపాణి ) లు మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.

- Advertisement -