తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదు..

415
gellu srinivas
- Advertisement -

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇష్టమొచ్చిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.క్యాబినెట్‌ను తెలంగాణ ద్రోహులుగా వర్ణించడాన్ని తీవ్రంగా కండిస్తూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తెలంగాణ రావడం బీజేపీ నాయకులుకి ఇష్టం లేదు. తెలంగాణ బిల్లు పాస్ అయిన వారం రోజుల్లోనే కర్ణాటక, గుల్బర్గా సభలో తల్లిని చంపి పిల్లను బతికిచ్చారన్నది మోడీ మాటను తెలంగాణ ప్రజలు మర్చిపోలే.

తెలంగాణ రాజకీయ ఏకీకరణ కోసం అన్ని సంఘాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే,టీఆర్‌ఎస్‌ పార్టీ రాజీనామాలు చేసింది.బీజేపీ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయింది నిజం కాదా? తెలంగాణ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గడప గడప తిరిగి యెండల లక్ష్మీ నారాయణని గెలిపిస్తే, నువ్వు కరీంనగర్ చౌరస్తా దాటి రాలేదు. నువ్వు తెలంగాణ వదివా.?

నీకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పార్లిమెంట్‌లో మాట్లాడాలి. బయ్యారంపై ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించండి.మా నాయకురాలు కవిత పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని దేశంలో పసుపు పండించే సీఎంలతో లేఖలు రాయించిన ఏర్పాటు చేయలేదు.

2018 ఎన్నికల సభలో రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎంపీ గెలిపించండి, పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తామని కోరితే నిజామాబాద్ ప్రజలు అరవింద్‌ని గెలిపించారు. గెలిచి 3 నెలలైన ఉలుకు పలుకు లేదు.ఎక్కడ అరవింద్ ఎంపీ? 100 రోజుల్లో పసుపు బోర్డ్ ఏది? అఫిడెఫిట్ వాల్యూ లేదా? మీ ఎంపీ మాటలకు వాల్యూ లేదా.? గెలిచిన 4 సీట్లకు బీజేపీ తెలంగాణ మొత్తం ఉందని భ్రమ పడుతున్నారు. కేటీఆర్‌ నాయకత్వం లో టీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో జడ్పీ ఎన్నికల్లో తేలిపోయింది.

సోషల్ మీడియా పోస్టింగ్‌ల ద్వారా యువత మీ దగ్గరికి ఉరికిరారు.ఆయుస్మాన్ భవ కార్యక్రమంతో కేవలం 25 లక్షల మందికి ఇస్తే, మిగిలిన 55 లక్షల కుటుంబాల మంది అడుక్కుని బతకాలా.? ఎందుకంటే ఆరోగ్యశ్రీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. మీ ఉత్సహాన్ని కాళేశ్వరం జాతీయ హోదా తేవడం గురుంచి పెట్టండి. ప్రతి జిల్లాలో నవోదయ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వన్నీ ఒప్పించండి అని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

- Advertisement -