రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలోని మోతె గ్రామం,కరకగూడెం రెవెన్యూ కార్యలయం నందు శనివారం రాజ్యసభ సభ్యులు,తెలంగాణ రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగనిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా మొక్కలు నాటారు.
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది భూదేవి మెడలో పచ్చలహారం వేస్తు మహా పర్యావరణ పరిరక్షణ కోసం యజ్ఞంలా కొనసాగుతుందని టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ అన్నారు. కాలుష్యాన్ని అరికట్టి స్వచ్ఛమైన ప్రాణవాయువును పొందాలంటే ప్రజలు,నాయకులు,ప్రజాప్రతినిధులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగ్యస్వాములు కావాలని పిలునిచ్చారు. అనునిత్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజలకు అవగాహన కల్పించి ఇంతటి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లుతున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కరకగూడెం మండల తహశీల్దార్ చిఎచ్.శేషగిరిరావు,ఆర్ఐలు టి. బాబురావు,బి.రాజు తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం,సెక్రెటరీ భూక్య వెంకటేష్ పాల్గొన్నారు.