- Advertisement -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై నిలదీయాలని సూచించనున్నారు. కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ పాల్గొన్నారు.
Also Read:CM KCR:వైద్యచరిత్రలో సువర్ణ అధ్యాయం
- Advertisement -