మొక్కలు నాటిన TRSMA అధ్యక్షులు ఆనంద్ రావు..

153
- Advertisement -

రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు,హరిత బంధు, వృక్షమిత్రులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా TRSMA అధ్యక్షులు ఆనంద్ రావు తానోబ తన జన్మదినం సందర్భంగా తమ వ్యవసాయ క్షేత్రంలో మూడు పండ్ల మొక్కలు జామా,పనస మరియు దానిమ్మ లను నాటారు. ఈ కార్యక్రమంలో ఆయన శ్రీమతి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యురాలు సుమిత్రానంద్ వారి కుమార్తె మహతి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తమకు దక్కినందుకు సమాజంలో ఈ స్పూర్తిని నింపిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -