కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ఎల్పీ భేటీ..

213
TRSLP meeting at Telangana Bhavan today
- Advertisement -

ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. బడ్జెట్‌ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపటినుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలపై చర్చిస్తారు.

బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్ధేశం చేస్తారు. సభలో జరిగే చర్చల సందర్బంగా ప్రభుత్వ పథకాలను సమర్దంగా లెక్కలతో సహా వివరించడం, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై మంత్రులు పకడ్భందీగా సమాధానాలివ్వడం తదితర అంశాలపై స్పష్టమైన సూచనలు చేయనున్నారు కేసీఆర్‌.

కాగా..పార్టీ తరపున పోటీచెయ్యనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఈ సమావేశంలో సీఎం పరిచయం చేసే అవకాశముంది. రాజ్యసభ ఎన్నికలు, పార్టీ అభ్యర్థులు రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అయితే ఒక స్థానాన్ని యాదవులకు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మూడు స్థానాలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు సునాయాసంగా గెలుచుకొవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ నెల 23న మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సంపైర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మజ్లీస్ అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసద్దుధ్దిన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. రాష్ట్రశాసనసభలోని తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతిస్తారని ఆయన ప్రకటించారు.

అయితే ప్రస్తుతం మజ్లీస్‌ కు ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒకవేల నాలుగో అభ్యర్థిపోటీ చేస్తే..ఈ నెల 23న పోలింగ్‌ జరుగుతుంది. లేదా ముగ్గురు అభ్యర్థులే భరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఈ క్రమంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఆ ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించినట్టు స్పష్టమవుతుంది. కానీ ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే..మజ్లీస్‌ ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటేయాలని ఓవైసీ కోరారు.

- Advertisement -