- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరపున శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి పార్టీ శ్రేణులందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ ఆదేశాల మేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి మరీ మునుగోడులో స్థానికంగా ఉంటూ టీఆర్‌ఎస్ సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ విజయంకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇన్‌ఛార్జీలకు వారికిచ్చిన ప్రాంతాల్లో తిరిగి తెరాస ప్రభుత్వం చేసిన సంక్షేమంను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు సైతం పార్టీ తరపున ధన్యావాదాలు తెలిపారు.
- Advertisement -