అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో మరో అద్బుతమైన విజయం సాధించింది. నేడు నింగిలోకి వెళ్లిన శాటిలైట్ విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి46(పీఎస్ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువున్న రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ‘రీశాట్ -2బీఆర్1’ను 557 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
దీంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విజయవంతంగా శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లేందుక కృషి చేసిన ప్రతి ఒక్కిరికి ధన్యవాదాలు తెలిపారు. భారతప్రజలు గర్వీంచదగ్గ విజయం సాధించారని ప్రశంసించారు. రీశాట్-2బీఆర్1 ఉపగ్రహం కాలపరిమితి రెండేళ్లు. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను, ఉగ్రశిబిరాలను ఇది సులభంగా గుర్తిస్తుంది.
Many congratulations team @isro 🙏
You keep making us all Indians proud https://t.co/cwj9TRtrty
— KTR (@KTRTRS) May 22, 2019