మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బీజేపీ అభ్యర్ధి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలా మంది స్పందించారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్టర్ ద్వారా స్పందించారు.
ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందన్నారు కేటీఆర్. గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమె జాతికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ భావజాలమున్నా కొన్ని పరిధులు దాటకూడదని ట్వీట్ చేశారు కేటీఆర్. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశ భక్తుడిగానే ఉంటారని ఆమె చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపాయి.
No matter what politics you affiliate with, what ideology you espouse; there are some lines that you just don’t cross
Pragya Singh Thakur’s statement is absolutely reprehensible and abominable. She should apologise unconditionally for vilifying the Father of our nation https://t.co/GgRIW1LFwu
— KTR (@KTRTRS) May 16, 2019