జగన్ ను కలిసి ఆశీస్సులు అందజేసిన రమణ దీక్షితులు

280
jagan

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా వారం రోజుల ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. రెండ్రోజుల క్రితం పులివెందుల వెళ్లిన ఆయన అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా ఇవాళ పులివెందులలో జగన్ ను కలిసి తిరుమల మాజీ అర్చకుడు రమణ దీక్షితులు. ఈసందర్భంగా జగన్ కు ఆశీస్సులు అందించారు రమణ దీక్షితులు. రమణ దీక్షితులకు సాదర స్వాగతం పలికిన జగన్ ఆయనతో కాసేపు ముచ్చటించారు. జగన్ ను కలిసిందుకు చాలా మంది అభిమానులు వస్తున్నారు.