హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లకు శ్రధ్దాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. రూ.50లక్షల చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. పుల్వామా ఉగ్రదాడి ఎంతగానో కలచివేసిందని కేటీఆర్ అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనమంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు.
జవాన్ల వల్లనే దేశం సురక్షితంగా ఉంటోంది. అమరుల త్యాగాలను దేశం ఏనాటికి మర్చిపోదు. వారి త్యాగాలు ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచిపోతాయి. ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమం అనంతరం ఆయన స్థానిక సీఆర్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడారు.
It was my privilege & honour to visit the HQ CRPF southern sector & offer tributes to #PulwamaMartyrs 🙏
As a token of my respect, in my personal capacity handed over cheque of ₹25 lakhs & also ₹25 lakhs from few friends who volunteeredhttps://t.co/s2Feq9W3C2 pic.twitter.com/JkppT2jJfe
— KTR (@KTRTRS) February 17, 2019