తెలంగాణలోని 32జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న అన్ని జిల్లాల కార్యాలయాలకు భూమి పూజ చేయనున్నారు. ఈసందర్భంగా ఇవాళ జడ్పీ చైర్మన్లు, మంత్రులతో ఫోన్లో మాట్లాడి ఎర్పాట్లను సమీక్షించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ మాట్లాడుతూ.. సోమవారం నిర్వహించబోయే జిల్లాల కార్యాలయ భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ సినియర్ నాయకులతో జరిగిన సమావేశంలో అయన అన్ని జిల్లాల పార్టీ లీడర్లు, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు.
కార్యాలయాల నమూనా పార్టీ అద్యక్షులు, ముఖ్యమంత్రి కెసియార్ గారు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ నెల 24న జరిగే పార్టీ కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ నిర్వహాణ కోసం జిల్లాల వారీగా పార్టీ ప్రతినిధులను కెటియార్ నియమించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, మంత్రులు లేనిచోట్ల నూతనంగా ఎన్నికైన జిల్లా జడ్పీ చైర్మన్లు యంఏల్యేలు, యంపీలు,యంఏల్సీలు కలిసి ఈ భూమిపూజ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మద్యలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ యంపిసిటీలు,జడ్పీటిసిలు, సర్పంచ్ లు, పార్టీ సినియర్ నాయకులు హజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ కోరారు.
జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలకు శంఖుస్ధాపన చేసే వారి వివరాలు:
కరీంనగర్- ఈటల రాజేందర్
,
నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
,
నిజామాబాద్- వేముల ప్రశాంత్ రెడ్డి,
జగిత్యాల- కొప్పుల ఈశ్వర్
,
జనగాం- ఎర్రబెల్లి దయాకర్ రావు,
సూర్యాపేట- గుంతకండ్ల జగదీష్ రెడ్డి,
మేడ్చల్- సిహెచ్ మల్లా రెడ్డి
,
మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్,
జోగులాంబ గద్వాల్- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
,
జడ్పీ చైర్మన్లు:
అసిఫాబాద్- కోవా లక్ష్మి, మంచిర్యాల –భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్- జనార్దన్ రాథోడ్, కామారెడ్డి- ధాపేధార్ శోభ, సిరిసిల్ల- అరుణ, పెద్దపల్లి- పుట్టమధు, జయశంకర్ భూపాలపల్లి- శ్రీ హర్షిని, మహబూబాబాద్- అంగోత్ బిందు, ములుగు- కుసుమ జగదీష్, భద్రాద్రి కొత్తగూడెం- కోరం కనకయ్య, , నల్లగొండ- బండా నరేందర్‌రెడ్డి, యాదగిరి భువనగిరి- సందీప్ రెడ్డి, సిద్దిపేట-రోజా శర్మ, మెదక్-హేమలత, సంగారెడ్డి- పటోల్ల మంజుశ్రీ, రంగారెడ్డి-తీగల అనిత రెడ్డి, వికారాబాద్- పట్నం సునీత రెడ్డి, నారాయణపేట- వనజమ్మ, నాగర్‌కర్నూల్- పద్మావతి