చిన్నారి వైద్యానికి కేటీఆర్ చొరవ … ఆరోగ్యంగా ఇంటికి చేరిన పసిపాప

197
Ktrtrs

సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన దృష్టికి వచ్చిన సమస్యను దగ్గరుండి పరిష్కారం చేస్తాడు. తాజాగా మరో చిన్న పాపకు సహాయం చేసి..ఆ పాప ప్రాణాలు కాపాడాడు కేటీఆర్. జగిత్యాల జిల్లా రంగారావు పేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రంగా రావుపేట గ్రామానికి చెందిన మధు సుమీత రాణి దంపతులు మే 8న మెట్పల్లిలో మగబిడ్డకు జన్మనిచ్చారు, డెలివరీ అనంతరం పరిశీలించిన స్థానిక డాక్టర్లు శిశువు పెద్దపేగు మూసుకుపోయి ఉందని, ఆపరేషన్ ద్వారా రంధ్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హైదరాబాదులో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షించిన అనంతరం బాబు ఆపరేషన్ కు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

ఏం చేయాలో అర్థంకానీ మధు దంపతులు సోషల్ మీడియాలో తమకు ఆర్థిక సాయం అందించాలని కోరారు, దంపతులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ది నెస్ట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్,హైదర్నగర్ సభ్యులు,డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు,సురేందర్ ఫౌండేషన్ మెట్పల్లి విరాళాల ద్వారా ఒక లక్ష 50 రూపాయల సేకరించి,తక్కువైన మొత్తం ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యాలయాన్ని డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ద్వారా సంప్రదించగా , సానుకూలంగా స్పందించక కేటీఆర్ చొరవ తీసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మిగిలిన మొత్తం ఖర్చులు భరించి వలసిందిగా విజ్ఞప్తి చేశారు .

ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయం వెంటనే రెండున్నర లక్షలు విడుదల చేసి చిన్న బాబు సర్జరీ విజయవంతం అయ్యేలా కృషి చేశారు.ఈ సందర్భంగా మధు దంపతులు మాట్లాడుతూ తమ బిడ్డ ప్రాణాలు కాపాడిఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్లేందుకుచాలా సంతోషంగా ఉందన్నారు,ఇందుకు సహకరించిన కేటీఆర్ కు మరియు టీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని చెప్పారు.