మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ సాయం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వేముల సదానందం అనే నేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య కవిత, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళి చేయించాడు. నిలువనీడ లేని ఆ నేతన్న కుటుంబం స్థానిక జిల్లా ఆసుపత్రిలో తల దాచుకుంది. వారి దయనీయ పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటిఆర్ భాదిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని పిఎ తో పాటుగా స్ధానిక నాయకులను, అధికారులను అదేశించారు.
దీంతో స్థానిక కౌన్సిలర్ భర్త కల్లూరి రాజు కే టీ ఆర్ పి ఎ , సదానందం కుటుంబాన్ని ఓ కమ్యునిటీ భవనంలొకి మార్చారు. కేటిఆర్ అదేశాలతో కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి కుటుంబం ఆర్తికంగా నిలబడే వరకు తోడుంటామని, వారి కుటుంబానికి నెల వరకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. మా పరిస్థితి తెలుసుకుని వెంటనే సహాయం అందించి, అండగా నిలిచిన కేటిఆర్ కు ఎల్ల వేళలా రుణపడి ఉంటామని సదానందం భార్య కవిత, పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు.