వికలాంగుడికి భరోసా ఇచ్చిన కేటీఆర్

393
ktr
- Advertisement -

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, ఎమ్మెల్యే కేటీఆర్. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పార్టీ సినియర్ నేత పల్లె కృష్ణయ్యకు అండగా నిలిచారు కేటీఆర్. కృష్ణయ్యను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్న కృష్ణయ్యకు కేటీఆర్ సూచన మేరకు కృత్రిమ కాలును అందించడం జరిగింది. రెండు వారాల క్రితం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లో భాగంగా కృష్ణయ్యకు కేటీఆర్ మిత్రుడొకరు కృత్రిమ కాలు అందించారు.

దీంతో కృష్ణయ్య ఈ రోజు కేటీఆర్ ని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణయ్యను టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి ప్రగతి భవన్ కి తీసుకువచ్చి కల్పించారు. కృష్ణయ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న కేటియార్, కృష్ణయ్యకు జీవనం సాగించేందుకు కావాల్సిన ఆదాయం కోసం ఏదైనా ఏర్పాటు చేసుకుంటా అంటే పూర్తి సహకారం అందిస్తామని, ఏదైనా చిన్న కొట్టు పెట్టుకుంటమంటే రుణ సౌకర్యం కూడా కల్పించేందుకు సహకరిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు కృష్ణయ్య కు సహకారం అందించాల్సిందిగా పల్ల ప్రవీణ్ ను కేటిఆర్ ఆదేశించారు.

- Advertisement -