- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో డివిజన్ చేరింది. నేరెడ్‌మెట్‌లో 782 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.
సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొత్తం 25,176 ఓట్లు పోలవ్వగా 24,632 ఓట్లు లెక్కించారు. డిసెంబర్ 4న లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం ఉదయం లెక్కించారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
- Advertisement -