స్ధానిక సంస్థల ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్ష కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. పరిషత్ పోరులో దాదాపుగా 75శాతానికి పైగా స్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 33 జిల్లాల జడ్పీ ఛైర్మన్లను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. కామారెడ్డిలో 22కు 12,సిరిసిల్లలో 13కు 8,కరీంనగర్‌లో 16కు 10 స్ధానాల్లో గెలుపొందింది.
ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం కరీంనగర్,రాజన్న సిరిసిల్ల,కామారెడ్డి జిల్లాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ మూడు జిల్లాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
ఇక నిజామాబాద్‌లో కారు జోరుకు హస్తం కుదేలైంది. మెజార్టీ ఎంపీటీసీ,జడ్పీటీసీ స్ధానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. మొత్తం 5,659 ఎంపీటీసీ, 534 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు 3212 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.