జోరుగా కారు, బేజారులో ప్రతిపక్షం..!

406
- Advertisement -

టీఆర్ఎస్ రథ సారథి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు కేసీఆర్ తో పాటు పార్టీ అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమించి.. నిత్యం ప్రజల గురించి ఆలోచించి పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు బాటలు వేశారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో.. ప్రజల అవసరాలకు తగినట్టుగా అద్బుత పాలన అందించారు. రాష్ట్రంలో అన్ని రంగాల, వర్గాల సంక్షేమానికి కృషి చేశారు. సీఎం కేసీఆర్ ఓ రైతు బిడ్డగా అన్నదాతల కష్టాలు ఎరిగి.. వారిని అక్కున చేర్చుకున్నారు. అన్నదాతల కోసం 24 గంటల విద్యుత్, రైతు బందు చెక్కుల పంపిణీ, రైతు భీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా అండగా నిలిచారు. పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు త్రాగునీటి కోసం కిలో మీటర్ మేర వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకునేవారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ పథకాలు చేపట్టి ఇంటింటికి మంచినీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దే.

ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కష్టకాలంలో ఉన్న తెలంగాణను అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి.. రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణ ప్రజల ఆంక్షాంక్ష మేరకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని కోరుకుందాం..

దేశ ప్రధానమంత్రి సైతం వేరే పార్టీకి చెందినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ అనేకమార్లు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన మెచ్యురిటీ గల వ్యక్తిగా పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించారు. పలువురు కేంద్రమంత్రులు సైతం తెలంగాణలో పర్యటనలు చేసి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్న అంశానికి ఇంతకన్నా పెద్దగా తార్కాణాలు అవసరం లేదు..

ప్రజలు బాహాటంగా టీఆర్ఎస్ నే గెలిపిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు..

- Advertisement -