అరవింద సమేత..క్లాసిక్ హిట్: సునీల్

273
sunil
- Advertisement -

అరవింద సమేత సినిమాలో నటిచినందుకు చాలా తృప్తిగా ఉంది అన్నారు హిరో సునీల్‌. సినిమా సక్సెస్‌ మీట్‌ లో సునీల్‌ మాట్లాడుతూ ఈ సినిమాతో తిరిగి క్యారెక్టర్‌ నటుడిగా రీఎంట్రీ ఇచ్చినందుకు చాలా హ్యాపిగా ఉందన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ బాగా నచ్చిందని తెలిపిన సునీల్. ఓ మంచి క్యారెక్టర్‌లో ఇలా నన్ను నేను చూసుకుని చాలా కాలమైందన్నారు.

సినిమాలో తాను నటించిన సీన్లనే త్రివిక్రమ్ ఎక్కువగా కట్ చేయించాడని అవసరం అయిన కామెడీనే ఉంచడం వలన సినిమా బాగా వచ్చిందన్నారు. బిర్యానీలో ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి ఏది ఎక్కువయినా తేడా కొడుతుంది అని తెలిపారు.ఫ్యాక్షన్‌ సినిమాల్లో మంచి క్లాసిక్‌ హిట్‌ మూవీని ప్రేక్షకులకు అందించాడని తెలిపిన సునీల్..చాలా రోజుల తర్వాత యాక్షన్‌-ఫ్యామిలీ సినిమాని చూసిన ఆనందం కలిగిందన్నారు.

సిల్లీ ఫెలోస్‌ మూవీతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన సునీల్ ఈ సినిమాతో తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -