దుబ్బాకలో TRS విజయం ఖాయం: TRS NRI

126
nri trs
- Advertisement -

లండన్ : దుబ్బాకలో జరగనున్న ఉపఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ అఖండ విజయం సాదించబోతుందని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. గత రెండు మూడు వారల నుండి అటు క్షేత్రస్థాయిలో ప్రాచారం నిర్వహిస్తూ ఇటు సోషల్ మీడియా ద్వారా పార్టీ గెలుపుకి క్రియాశీలకంగా పని చేశామని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నో గ్రామాలు తిరిగామని ప్రతి ఒక్కరు టి.ఆర్.యస్ పార్టీకి, కెసిఆర్ చేసిన అభివృద్ధికే పట్టం కడతామని చెప్తున్నట్టు, క్షేత్రస్థాయిలో ప్రచార బృందానికి నాయకత్వం వహిస్తున్న సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ,రత్నాకర్ కడుదుల మరియు రాజ్ కుమార్ శానబోయిన తెలిపారు.

బిజెపి, కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు ఓటు తో ప్రజలు తగిన బుద్ది చెప్తారని, అప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజా శ్రేయస్సు కై పని చేయాలని నాయకులు సృజన్ రెడ్డి చాడ, రమేష్ & అశోక్  హితవు పలికారు. ఎన్నారైలంతా టి.ఆర్.యస్ పార్టీ కెసిఆర్ వెంటే ఉన్నారని, దుబ్బాక నియోజికవర్గ పరిధిలోని ఎంతో మంది ఎన్నారైలతో మాట్లాడమని వారి బంధువులు మిత్రులు సైతం టి.ఆర్.యస్ కే ఓటు వేస్తున్నట్టు చెప్పారని, దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని నాయకులు రవి రేతినేని, సురేష్ బుడగం మరియు రవి ప్రదీప్ పులుసు తెలిపారు.

ముఖ్యంగా మైనారిటీ ప్రజలకోసం కెసిఆర్ ఎన్నో ప్రత్యేక పధకాలు, కార్యక్రమాలు చెప్పట్టారని, ప్రతీ ఇల్లు ఏదోరకంగా లబ్ది పొందినవారేనని, ప్రజలంతా కృతజ్ఞతో టి.ఆర్.యస్ వైపే ఉన్నారని నాయకులు అబ్దుల్ జఫర్ తెలిపారు. ఎన్నారై టి.ఆర్.యస్ పక్షాన సోషల్ మీడియా ఇంచార్జ్ గా పని చేస్తున్న నవీన్ భువనగిరి మాట్లాడుతూ, ప్రతీ సామాజిక మాధ్యమంలో దుబ్బాకలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా ప్రచారం చేశామని, ప్రత్యర్థుల అసత్య ప్రచారాలని సమర్ధవంతంగా తిప్పి కోట్టామని, అడుగడుగునా వారు సరైన సమాధానాలు లేక మొహం చాటేశారని. క్షేత్రస్థాయిలో అటు హరీష్ రావు సవాల్ కి ఇటు సోషల్ మీడియా వేదికగా మేము విసిరినా సవాళ్ళకు ప్రత్యర్థుల దగ్గర సమాధానాలు లేవని, ప్రజలన్నీ గమనిస్తున్నారని, టి.ఆర్.యస్ పార్టీ వైపే ఉన్నారని తెలిపారు.

దుబ్బాక ప్రజలంతా చైతన్యవంతుల్ని కెసిఆర్ నాయకత్వమే మనకు శ్రీ రామ రక్షా, టి.ఆర్.యస్ పార్టీ గెలుపుతోనే దుబ్బాక మరింత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి సోలిపేట సుజాత గారిని లక్ష మెజారిటీ తో గెలిపించి ప్రతిపక్షాల కుట్రలకు తగిన బుద్ది చెప్పాలని కార్యదర్శి సత్య చిలుముల తెలిపారు. చివరిగా ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్ధాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బ్యాలెట్ పై మూడవ వరుసలోని కారు గుర్తు పై ఓటు వెయ్యాలని దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అలాగే క్షేత్రస్థాయిలో ప్రాచారానికి వచ్చిన ఎన్నారై టి.ఆర్.యస్ బృందానికి సహకరించిన నాయకులకు, మంత్రి హరీష్ రావు గారి సిబ్బందికి, మీడియా మిత్రులకి , స్థానిక నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.సోషల్ మీడియా ద్వారా పార్టీ గెలుపుకి ప్రచారం నిర్వహిస్తున్న ఎన్నారై టి.ఆర్.యస్ కార్యవర్గ సభ్యులకి, పార్టీ అభిమానులకి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -