మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఏకపక్షమేః కేటీఆర్

373
Ktr
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. మున్సిపాలిటీల వారీగా నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల బలాబలాలపై ఆరా తీశారు.ఈ నెల 31లోపు బూత్, డివిజన్, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో స్వచ్చందంగా లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు.

ఏ ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కున్నదని… ప్రతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పార్టీ కమీటీల ఎర్పాటు పైన సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కమీటీల ఎర్పాటు దాదాపుగా పూర్తి అయిందని పార్టీ ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఈ నెలాఖరునాటికి కమీటీల నిర్మాణం పూర్తి చేసి, వాటి జాబితాను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసియార్ గారికి అందించాలన్నారు .

- Advertisement -